హైదరాబాద్: 28°C
తెలంగాణ

పైప్ లైన్ లీకేజీతో వృథాగా ప్రవహిస్తున్న నీరు

PDPL: ఓదెల మండలంలోని మల్లికార్జున ఆలయ సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి వారం రోజులుగా తాగునీరు వృథాగా పొలాల్లోకి ప్రవహిస్తోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా మరమ్మతులు చేపట్టడం లేదని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి ఉన్న వేళ ఇలా వృథా చేయడం సరికాదని, వెంటనే స్పందించి లీకేజీని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.