హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టమాటాల్లో మందు.. 40 పందుల మృతి

KRNL: ఎమ్మిగనూరు మునెప్ప నగర్‌కు చెందిన వీరేశ్, మద్దమ్మలకు చెందిన 40 పందులను రాధాకృష్ణ కాలనీలో విడిచారు. మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు టమాటాల్లో మందు పెట్టి పందులకు మేపుగా వేశారని యజమానులు ఆరోపించారు. వాటిని తిన్న పందుల్లో కొన్ని మృతి చెందగా, మరికొన్ని అపస్మారక స్థితిలో పడిపోయాయి. ఈ ఘటనతో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని యజమానులు వాపోయారు.