JN: దేవరుప్పుల మండలం కొలుకొండ శివారులోని రామచంద్రాపురంలో మూడు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పశువుల కొట్టాలుగా వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల వద్ద పేడ, గడ్డి, చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన, దోమలు, ఈగలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యను పది రోజుల క్రితమే గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు.
తెలంగాణ
పశువుల కొట్టాలుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు


