JN: కొడకండ్ల శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3,550 నగదు, 7 స్మార్ట్‌ఫోన్లు, 7 బైక్‌లు, 104 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై చింత రాజు హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
తెలంగాణ
పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్ట్


