హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తిగత వివరాలను పంచవద్దు: SI

BHPL: SP సంకీర్త్ ఆదేశాలతో BHPL జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, కళాశాలలో షీ టీం ఆధ్వర్యంలో మహిళలు, బాలికల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై స్వప్నకుమారి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహాలు చేయవద్దని, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పంచుకోరాదని సూచించారు. వేధింపులు ఎదురైతే వెంటనే షీ టీంను ఆశ్రయించాలన్నారు.