హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూతపడ్డ మంచినీటి పంపిణీ కేంద్రం

కాకినాడ: సామర్లకోట పోలీస్ స్టేషన్ సమీపంలో రక్షిత మంచినీటి పంపిణీ నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవభారత్ వెంచర్స్ సౌజన్యంతో మున్సిపాలిటీ 20 ఏళ్ల కిందట ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం, సాయంత్రం రూ.2 కే 20 లీటర్ల నీరు అందించేవారు. నెల రోజులుగా కేంద్రం మూసి ఉంటుండటంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.