కాకినాడ: గొల్లప్రోలు మండలంలో పలు రేషన్ డిపోలకు పీడీఎస్ బియ్యం సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ప్రతి నెలా 25వ తేదీ లోపు రేషన్ షాపులకు రావాల్సిన బియ్యం, ఈనెల ఇంకా చేరకపోవడంపై కార్డుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 11 షాపులకు బియ్యం చేరినా, మండల పరిధిలోని గ్రామాల డిపోలకు ఇంకా రాలేదని జనం వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలులో రేషన్ బియ్యం అందక ఇబ్బందులు


