హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి'

SKLM: నరసన్నపేట మండలంలోని పోతయ్య వలసలో యువ వైసీపీ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య బుధవారం పర్యటించారు. ఈ మేరకు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని తెలిపారు.