హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల భద్రతకు ప్రత్యేక నిఘా..!

అన్నమయ్య: విద్యార్థుల భద్రత కోసం అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో ఆకతాయిలపై ముమ్మర నిఘా ఏర్పాటు చేశారు.డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణతో పాటు శక్తి టీమ్స్ ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నాయి. విద్యార్థినులను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.