హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వజ్రంపేట వీధిలో త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు

SKLM: వజ్రంపేట వీధిలో రక్షిత మంచినీటి కొరతపై స్థానికులు, ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదేశాలతో పంచాయతీ కార్యనిర్వహణ కార్యదర్శి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నూతన వీధి కొళాయి రెండు ఏర్పాటు చేశారు. కొళాయిల ఏర్పాటుతో మంచినీటి సమస్యకు పరిష్కారం లభించనుందని, తాగునీటి ఇబ్బందులు తొలగుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.