హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ కోతలపై రైతుల ఆందోళన

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండ విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద విద్యుత్‌ కోతలపై పోతుల బొగుడ రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కరెంట్ సరిగా లేక వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 12 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.