హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ASI కుటుంబానికి రూ.1.50 లక్షల సాయం

NDL: డోన్ అర్బన్ పీఎస్ ASI మద్దిలేటి అనారోగ్యంతో మృతి చెందారు. 1993 పోలీస్ బ్యాచ్ మిత్రులు ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. బ్యాచ్ తరఫున సేకరించిన రూ.1.50 లక్షలను ఎస్పీ సునీల్ షోరాన్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయక్, బ్యాచ్ మిత్రులు పాల్గొన్నారు.