హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆహార భద్రతపై నిఘా ఏది..?

SRPT: సూర్యాపేట జిల్లాలో ఆహార భద్రతపై నిఘా కరువైంది. జిల్లాలో హోటళ్లు, బేకరీల్లో అపరిశుభ్రత, కాలం చెల్లిన ముడిసరుకులు, నిల్వ ఆహారం వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో సుమారు 200–250 హోటళ్లు, 280–320 బేకరీలు ఉన్నట్లు అంచనా. ఫిర్యాదులు వచ్చినప్పుడే తనిఖీలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 15 కేసులు నమోదయ్యాయి.