హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొబ్బిలి గ్రోత్ సెంటర్ ప్రమాదంపై మంత్రి ఆరా

VZM: బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లోని బెర్రీ పరిశ్రమలో జరిగిన ఫర్నేస్ పేలుడు ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. పేలుడు సమయంలో కార్మికులు, ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, ఘటనపై ఎమ్మెల్యే, కలెక్టర్, ఫైర్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ఫర్నేస్ పేలుడుకు కారణాలపై లోతైన విచారణ జరిపి సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు.