హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మనుబోలులో బైక్ బోల్తా.. ఒకరికి గాయాలు!

నెల్లూరు: మనుబోలు బైపాస్ రోడ్డుపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాపూరు మండలం గోనుపల్లికి చెందిన బండి రామచంద్రయ్య బైక్‌పై నెల్లూరుకు బయలుదేరాడు. మనుబోలు బైపాస్ వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పడిపోయాడు. రామచంద్రయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.