VZM: విజయనగరం పట్టణంలోని మహారాజా ఆసుపత్రి ప్రాంగణంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా వారు ఈ ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్హులైన ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రెగ్యులర్ చేసేంతవరకు 100% గ్రాఫ్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నర్సులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహారాజా ఆసుపత్రి వద్ద నర్సుల ధర్నా


