హైదరాబాద్: 28°C
క్రీడలు

'బంతితో సత్తాచాటడం సంతోషంగా ఉంది'

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నమన్ ధీర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. బంతితో సత్తాచాటడం ఆనందంగా ఉందని, తన బౌలింగ్‌తో జట్టుకు ఉపయోగపడటం సంతృప్తినిచ్చిందన్నాడు. ఇక బ్యాట్‌తోనూ రాణించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఆల్‌రౌండర్‌గా జట్టుకు మరింత ఉపయోగపడటమే తన లక్ష్యమని చెప్పాడు.