హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్యంపై కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

KRNL: ఆదోని పట్టణంలోని పలు వార్డుల్లో ఇవాళ మున్సిపల్ కమిషనర్ నాయిమ్ హమ్మద్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డ్రైనేజీలు, చెత్త తొలగింపు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్లపై చెత్త పేరుకుపోవడంపై సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడా మురుగునీరు నిలవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.