హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిథిలావస్థలో రోలుగుంట తహశీల్దార్ కార్యాలయం

AKP: రోలుగుంట తహశీల్దార్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులు ఊడిపోయి ఇనుప రాడ్లు బయటపడగా, మండల సర్వేయర్ గది, రికార్డు రూమ్ పైకప్పులు పాడై వర్షానికి నీరు కారుతోంది. దస్త్రాలు తడవకుండా రికార్డు రూమ్ కిటికీలు మూసివేశారు. పాత భవనంలో విధులు నిర్వహించేందుకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.