PLD: శిశువుల అక్రమ రవాణా కేసులో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తెనపల్లికి చెందిన బాబావలి, ముప్పాళ్లకు చెందిన శ్రీనివాసరావు మధ్యవర్తులుగా ఉండి శిశువులను విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది మహారాష్ట్రలో నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
శిశువుల అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్ట్!


