NZB: విశాఖ నోవాటెల్ బీచ్‌లో మంగళవారం లభ్యమైన మృతదేహం మిస్టరీ వీడింది. మృతుడు నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన తిమ్మిశెట్టి వికాస్ (20)గా పోలీసులు నిర్ధారించారు. మంగళవారం సముద్రంలో తేలుతున్న అతడిని లైఫ్ గార్డ్స్ ఒడ్డుకు చేర్చగా అప్పటికే మృతిచెందాడు. యువకుడి మృతి ప్రమాదమా లేక ఆత్మహత్యా అన్న కోణంలో ఎంఆర్ పేట CI గోవిందరావు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
విశాఖ బీచ్ లో నిజామాబాద్ యువకుడి మృతి


