హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి'

KRNL: కోసిగి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం SFI నాయకులు సందర్శించారు. తరగతి గదులు, వాష్‌రూమ్‌లు, తాగునీరు, RO ప్లాంట్ల సమస్యలను గుర్తించారు. కొట్టాలలో భవనం లేక చర్చిలో 40 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని SFI జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు.