హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రూ. 10లక్షల విలువైన బాణసంచా సీజ్!

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండల కేంద్రంలో భారీగా అక్రమ బాణాసంచాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం రాత్రి ఉప్పరకాలనీలో బాణసంచా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. నివాస ప్రాంతాల్లో అనుమతి లేకుండా రెండు లారీలో అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 10లక్షలు ఉండవచ్చని ఆయన వెల్లడించారు.