హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల తనిఖీల్లో 137 వాహనాలు స్వాధీనం

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో 150 మంది పోలీసులతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 137 వాహనాలు, 3 బెల్ట్ షాపుల్లో 42 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు.