హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే గేట్ వద్ద తప్పని తిప్పలు

ASF: రెబ్బెన మండలంలోని గంగాపూర్ రైల్వే గేట్‌తో 16 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గూడ్స్ రైళ్ల రాకపోకలు పెరగడంతో గేట్ తరచూ మూసివేస్తున్నారు. దీంతో ఇరువైపులా వాహనాలు, బస్సులు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. అత్యవసర సమయాల్లో రోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.