హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌స్టేషన్లకు నిధులు మంజూరు: ఎమ్మెల్యే

NRML: తానూరు మండలం భామ్ని, కుబీర్ మండలం వాయిలింగి గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి రూ.5.90 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం తెలిపారు. లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి ఈ సబ్‌స్టేషన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.