హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నడిరోడ్డుపై నిలిచిన ఆర్టీసీ బస్సు..!

ELR: జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం సమీపంలో భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో మొరాయించింది. సాంకేతిక లోపంతో బస్సు ఒక్కసారిగా రోడ్డుపై నిలిచిపోవడంతో విధులకు వెళ్లే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సుల ఫిట్‌నెస్, నిర్వహణపై దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.