SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ తల్లి మీనాక్షి (29), ఏడు నెలల కుమారుడు మృతి చెందారు. రెండున్నరేళ్ల కుమార్తె పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. కుటుంబ కలహాలు లేదా ఇతర కారణాల ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంపై ఎచ్చెర్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం


