ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని పిటికాయగుళ్లలో మంగళవారం సాయంత్రం సీఐ మల్లికార్జున గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా, పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో శాంతిభద్రతలకు సహకరించాలి: సీఐ


