నెల్లూరు: ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నత అధికారులు ఆదేశాలు మేరకు బుధవారం నుంచి ఈనెల తొమ్మిదవ తేదీ వరకు నెల్లూరు జిల్లా సర్కిల్ పరిధిలో సేవా సేతు అభియాన్ నిర్వహించనున్నట్లు ఎస్‌ఈ సుధాకర్ తెలిపారు. పీఎం సూర్య ఘర్ ఉచిత సోలార్ విద్యుత్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. దరఖాస్తు విధానం, సబ్సిడీ, సోలార్ రూప్ టాప్ ఏర్పాటు, గురించి వివరాలు తెలియజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు


