హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో వార్డుల పునర్విభజనకు గ్రీన్‌సిగ్నల్‌

BPT: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా బాపట్ల పురపాలక సంఘంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 7 నుంచి 16వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పునర్విభజనకు సంబంధించిన గెజిట్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఇందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.