హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏటీఎం సదుపాయం లేక ఇబ్బందులు..!

అన్నమయ్య: పెద్దమండ్యం మండల కేంద్రంలో ఏటీఎం సదుపాయం అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సమయాల్లో నగదు అవసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నగదు ఉపసంహరణకు కలిచెర్ల, గాలివీడు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. మండల కేంద్రంలో ఏటీఎం సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.