అనంతపురం: పెద్దవడుగూరు మండలంలో చిరుత పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మండల పరిధిలోని అప్పేచెర్ల గ్రామ సమీపంలోని పొడవకొండలో చిరుత పులి సంచారం చేస్తున్నట్లు పశువులు, మేకలు, గొర్రెల కాపరులు చెబుతున్నారు. మేకలను సైతం తినేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కొండెక్కిన చిరుత.. భయాందోళనలో ప్రజలు


