హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యాదగిరిపల్లిలో 9 అడుగుల కొండచిలువ

BHNG: యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి గ్రామంలో 9 అడుగుల కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రాచకొండ చిన్నరాజు ఇంట్లోకి కొండచిలువ రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో స్నేక్ క్యాచర్లు అక్కడికి చేరుకుని కొండచిలువను బంధించారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.