SDPT: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వీధి కుక్కల బెడద పెరిగిపోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులు, కాలనీల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులు, పాదచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు. వాహనదారులను వెంటాడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: వీధి కుక్కల బెడదపై స్థానికుల ఆందోళన


