హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌కు సన్మానం

JGL: జాతీయ స్థాయిలో ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా అవార్డు అందుకున్న ధర్మపురికి చెందిన వడ్లూరి రవీందర్‌ను పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. జిల్లా డీడబ్ల్యూఓ భాస్కర్, ధర్మపురి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి, సీడీపీవో వాణిశ్రీ, ఏసీడీపీవో మౌనిక, సూపర్‌వైజర్లు, టీచర్లు, కౌన్సిలర్లు రవీందర్‌కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.