హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటను నాశనం చేసిన అడవి పందులు

ఆదిలాబాద్ మండలం ఖానాపూర్ కు చెందిన మహిళా రైతు రాథోడ్ సంగీత తన మొక్క పంట సాగు చేశారు. పంట చేతికందే సమయంలో అడవి పందులు దాడి చేయడంతో సుమారు 4 ఎకరాల్లో పంట దెబ్బతింది. రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం అందించాలని కోరారు.