హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవానీనగర్ తండాలో చోరీ

మహబూబాబాద్‌లోని భవానీనగర్ తండాలో ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బట్టు సురేష్‌–స్వాతి దంపతులు సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి బంధువు అంత్యక్రియలకు వెళ్లారు. దీంతో దుండగులు తాళం పగులగొట్టి బీరువాలోని 30 తులాల వెండి, రూ.20 వేల నగదు అపహరించారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.