హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుల వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి: ఎస్పీ

NRPT: పోలీస్ స్టేషన్‌కు రాలేని బాధితుల వద్దకే వెళ్లి ఆన్‌సైట్‌లో ఫిర్యాదు స్వీకరించాలని జిల్లా ఎస్పీ వినీత్ పోలీసు అధికారులను ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అత్యవసర బాధితులకు ప్రాధాన్యం ఇస్తూ తక్షణమే స్పందించాలని అన్నారు. ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.