హైదరాబాద్: 28°C
తెలంగాణ

వయోవృద్ధుల సేవకు పటేల్ గూడెం వ్యక్తికి అవార్డు

BHNG: ఆలేరు మండలం పటేల్ గూడానికి చెందిన బొమ్మకంటి లక్ష్మీనారాయణను కలెక్టరేట్‌లో మంగళవారం ఘనంగా సన్మానించారు. వయోవృద్ధులకు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ జిల్లా పరిషత్ సీఓ, సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఇన్‌చార్జీ చిలుకూరి శ్రీనివాస్ శాలువా కప్పి, మెమొంటో అందజేశారు. అనంతరం ఆయనకు అవార్డు ప్రదానం చేశారు.