హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళం పగులగొట్టి నగదు, బంగారం అపహరణ

JN: కొడకండ్ల మండలంలోని నర్సింగాపురంలో ఇంట్లో చోరీ జరిగింది. బూర్గు అంజయ్య కుటుంబంతో కలిసి మూడు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.20 వేల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.