హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

WGL: వరంగల్-చింతల్‌పల్లి వద్ద మంగళవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పట్టాలు దాటుతుండగా కేరళ సూపర్‌ఫాస్ట్‌ రైలు ఢీకొట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు, నీలం జీన్స్‌, గోధుమ రంగు చొక్కా ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. వివరాలు తెలిసిన వారు 9849749220 సంప్రదించాలి.