సిద్దిపేట జిల్లా శివాయిపల్లిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను అనుమతి లేకుండా నరికివేసినందుకు సర్పంచ్‌కు అటవీశాఖ అధికారిణి హిమచందన రూ.10,500 జరిమానా విధించారు. చట్టాలను అతిక్రమించి చెట్లను తొలిగిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను కాపాడాలని, నరికివేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ
సర్పంచ్‌కు రూ.10,500 జరిమానా!


