హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేటలో నేడే కిసాన్ మేళా

SDPT: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు VSS కన్వెన్షన్ హాల్‌లో కిసాన్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాకు జిల్లాలోని రైతాంగం పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ కే.హైమవతి కోరారు. వ్యవసాయంలో సరికొత్త సాంకేతికత, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.