WGL: చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడుస్తూ అమ్మమ్మకు విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
చిన్నారిపై లైంగిక దాడి..పోక్సో కేసు నమోదు


