హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కలకలం

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని MJ స్కూల్ వెనుక గోడ పక్కన కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.