హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛన్‌కు క్షేత్రస్థాయి పరిశీలన

MLG: చేయూత (ఆసరా) పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం డీపీవో వెంకయ్య వెంకటాపురం మండలంలోని రాచపల్లి, వీఆర్కేపురం, కమ్మరిగూడెం గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారుల ఇళ్ల వద్ద వివరాలు సేకరించారు. ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలను పరిశీలించి, తుది నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.