హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొల్లేరుపై తుది నివేదిక సిద్ధం: కలెక్టర్

ELR: కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై కేంద్ర సాధికార కమిటీ కోరిన అంశాలతో తుది నివేదికను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. ఏలూరు కలెక్టరేట్లో కలెక్టర్ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అభయారణ్య సరిహద్దుల హేతుబద్ధీకరణ, జిరాయితీ, డీ-ఫారం భూములు, పునరావాసం, ప్రభుత్వ భూములు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై సమీక్షించారు.