భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై మాజీ పాకిస్థాన్ పేసర్ సోహైల్ తన్వీర్ ప్రశంసలు కురిపించాడు. వారి అనుభవం, ప్రతిభ భారత క్రికెట్‌కు వరమన్నాడు. ఫిట్‌నెస్, ఫామ్ కొనసాగిస్తే వీరిద్దరూ సాధ్యమైనంతకాలం ఆడాలని ఆకాంక్షించాడు. వయసును ప్రతికూలంగా చూడాల్సిన అవసరం లేదని, సీనియర్ ఆటగాళ్ల అనుభవం యువ క్రికెటర్లకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని తన్వీర్ పేర్కొన్నాడు.
క్రీడలు
కోహ్లీ, రోహిత్ భారత క్రికెట్‌కు వరం: తన్వీర్


