హైదరాబాద్: 28°C
క్రీడలు

'స్వింగ్ కింగ్‌' ఈజ్ బ్యాక్

'గ్యాప్‌ ఇవ్వలే వచ్చింది' అని ఓ సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ ఇప్పుడు భువనేశ్వర్ కుమార్‌కు సరిగ్గా సెట్ అవుతుంది. దాదాపు నాలుగేళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అతడు, మళ్లీ INDలోకి రీఎంట్రీ ఇచ్చాడు. IPLలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని NZతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. 'స్వింగ్ కింగ్‌'గా పేరున్న భువి పునరాగమనం యువ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తిదాయకం.